యలమంచిలి: ఫిబ్రవరి, 7 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక భక్తాంజనేయ స్వామి వారి నూతన నిర్మాణ దేవాలయం ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా శనివారం రథోత్సవం జరిగింది. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు శుక్రవారం నిర్వహించారు. స్వామివారికి సువర్చలాదేవికి కళ్యాణం శుక్రవారం జరిగింది. అనంతరం స్వామి వారిని రథంపై అధిష్టించి, గ్రామ ఉత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ప్రధాని లాగటానికి మహిళా భక్తులు పోటీపడ్డారు. ఏటి గట్టు నుంచి అమ్మవారి ఆలయం వరకు, ప్రధాన వీధుల గుండా సాగిన రథోత్సవం ప్రజలకు నయనానందం కలిగించింది. స్వామివారు రథం పై నుండి అనుగ్రహ దర్శనం ఇచ్చారు. ఈ ఉత్సవంలో, అర్చకులు వాడపల్లి గోపి,చైర్మన్ కాసా సత్యనారాయణ, బండారు రాధాకృష్ణ, ఆకుల భాస్కర్ రావు, చిలుకూరు ఆంజనేయులు, ఆకుల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
యలమంచిలిలో రథోత్సవం
స్వామివారి రథాన్ని, లాగుతున్న మహిళా భక్తులు