పాలకొల్లు: ఫిబ్రవరి,9(తెలుగు న్యూస్ పవర్) టిడిపి ప్రభుత్వం గతంలో ఇచ్చిన జిఓ ప్రకారం కాపు రిజర్వేషన్ కోరుతూ మాజీ మంత్రి,ఎంపీ,చేగోండి హరి రామ జోగయ్య, ముత్యాల శ్రీనివాస్, రాష్ట్రీయ జన సంక్షేమ సేన తరపున సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కు లేఖ సంధించారు. అగ్రవర్ణాలైనా కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య , క్షత్రియ, వెలమ మొదలగు కులాలతో విద్య ఉద్యోగ రంగాలలో పోటీ పడలేక కాపులు వెనుకబడి ఉన్నారని తమ లేఖలో పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్, మంజునాథ్ సిఫారసు మేరకు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం 13వ రాజ్యాంగ సవరణ ప్రకారం అగ్రవర్ణాలకు కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో, ఐదు శాతం రిజర్వేషన్లు కాపులకు వర్తింప చేస్తూ శాసనసభలో 14 మరియు 15 నెంబరు గల బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించారన్నారు. ఈ బిల్లులు గవర్నర్ ఆమోదం పొందటం,అమలకు
జీవోలు రావడం, గెజిట్ నోటిఫికేషన్ జరిగిపోయిన తరువాత,ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది సుప్రీంకోర్టు కు వెళ్ళారు. వారు ఈ చట్టాన్ని సమర్థించి తీర్పు ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వం కాలపరిమితి ఈ లోపు ముగిసి పోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రావటం, కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని, ఐదు సంవత్సరాలు కాలయాపన చేసింది. వైయస్సార్ పార్టీ ప్రభుత్వం. అందరికీ కలిపి10 % వర్తింప చేశారన్నారు . కాపు సంక్షేమ సేన,అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశానని, దీనిని వ్యతిరేకిస్తూ జగన్ ప్రభుత్వం హైకోర్టులో కౌంటర్ వేశారన్నారు. కాపులకు10 శాతం రిజర్వేషన్ లో 5 శాతం వాటా కలగజేయటానికి వ్యతిరేకించటానికి కారణం, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులు ఆర్థికంగా కాని, విద్యాపరంగా గాని పుంజుకోవటం ఇష్టం లేకపోవడం అని చెప్పవలసి వస్తుందన్నారు.అయితే ఈ రకమైన రిజర్వేషన్ అగ్రవర్ణాలకు సంబంధించినదే కానీ, బీసీ కులస్తులకు ఎటువంటి నష్టం కరగజేయడం లేదని గ్రహించాలన్నారు. ప్రస్తుతం కాపు రిజర్వేషన్ రాష్ట్ర హైకోర్టు విచారణలో ఉన్నది. ఈనెల 4 తేదీన హైకోర్టు బెంచ్ ముందు విచారణ జరిగింది. ఈ అంశంపై ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తీరు ఏమిటో తెలియజేయాల్సిందిగా, తెలుగుదేశం ప్రభుత్వ
నిర్ణయాన్ని కోరింది. అగ్రవర్ణాల 10 శాతం ఈడబ్ల్యుఎస్ కోటాలో 5
శాతం కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ గత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కాబట్టి, అదే నిర్ణయాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తూ తమ నిర్ణయాన్ని సరికొత్త కౌంటర్ హైకోర్టులో దాఖలు చేయాల్సిందిగా రాష్ట్రీయ జన సంక్షేమ సేన కోరుతున్నది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కాపుల మద్దతు ప్రధానమైనది అన్నారు. వారికి 5శాతం రిజర్వేషన్ కల్పించడం న్యాయసమతమే, కాకుండా సామాజిక న్యాయం కూడా అవుతుందని అన్నారు. చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించి కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించాలని లేఖలో కోరారు.
కాపులకు 5 శాతం ఈడబ్ల్యూఎస్ కోట వర్తింప చేయాలి -రాష్ట్రీయ జన సంక్షేమ సేన డిమాండ్.
సిహెచ్ హరిదాము జోగయ్య