Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీ సెమిస్టర్ ఫలితాలు విడుదల.

సెమిస్టర్ ఫలితాలు విడుదల చేస్తున్న ప్రిన్సిపల్ రాజరాజేశ్వరి

పాలకొల్లు: ఫిబ్రవరి, 10 (తెలుగు న్యూస్ పవర్) శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 1వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జనవరి 23 నుండి 31 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
1 వ సెమిస్టర్‌లో మొత్తం 163 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 151 మంది విద్యార్థినీ విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 93% గా నమోదయ్యింది.
ఈ సందర్భంగా డా. టి. రాజరాజేశ్వరి ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ శ్రీ టి. కృష్ణ, పరీక్షల కమిటీ సభ్యులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.