Skip to main content

Telugu News Power

మావుళ్ళమ్మ ను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.

అమ్మవారి చిత్రపటం అందజేస్తున్న ఆలయ అధికారి
అమ్మవారి దేవాలయంలో ఆశీర్వచనం అందుకుంటున్న పోలీసు ఉన్నతాధికారులు

భీమవరం: ఫిబ్రవరి,12(తెలుగు న్యూస్ పవర్) భీమవరం ఇలవేల్పు, శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని, పోలీసు ఉన్నతాధికారులు గురువారం దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు, పండితులు, ఐజీ, అశోక్ కుమార్, ఎస్ పి, అద్నాన్ నయీమ్ హస్మి లకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీరిరువురికి, వేద ఆశీర్వచన పూజలు, ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ చేయించారు. అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, ప్రసాదం, దేవాదాయ శాఖ, అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, బి నాగభూషణం, ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్, ఆంజనేయ ప్రసాద్, దేవస్థానం విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో, జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, దేవోదయ ధర్మాదాయ శాఖ తనిఖీదారు వి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.