
పాలకొల్లు: ఫిబ్రవరి,13(తెలుగు న్యూస్ పవర్) స్థానిక చాంబర్స్ కళాశాల ప్రాంగణంలో వికాస కాకినాడ కలెక్టరేట్ వారి సహకారం తో జాబ్ మేళాను శుక్రవారం నిర్వహించారు. అభ్యర్థులు 258 మంది హాజరైయ్యారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకొల్లు మండల విద్యాశాఖ అధికారి గుమ్మల్ల వీరస్వామి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు.
వీరస్వామి మాట్లాడుతూ, విద్యార్థి దశలోని క్రమశిక్షణ భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని నేడు ప్రతి ఉద్యోగానికి సాంకేతిక నైపుణ్యం మరియు చురుకుదనం చాలా అవసరం అని అందుకు ప్రతి విద్యార్థి చదువుచున్న కోర్సులకు అనుగుణంగా అదనపు సర్టిఫికెట్ కోర్సులు మరియు అర్థమెటిక్, లాజికల్ , క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ పై పట్టు సాధించాలని తద్వారా అత్యున్నత ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుకుచ్చుకోగలరని అన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. వెంకటేశ్వరావు గారు మాట్లాడుతూ తమ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు విద్యుత్ తో పాటుగా ఉద్యోగ అవకాశాలు కల్పనే లక్ష్యంగా నిర్దేశం చేసుకొని ప్రతి సంవత్సరం క్యాంపస్ ప్లేస్మెంట్స్ , మెగా జాబ్ మేళాలు లాంటివి నిర్వహించి విద్యార్థుల లక్ష్యాలను నెరవేర్చుటకు కృషి చేస్తున్నదని, విద్యార్థులు నేడు పోటీ ప్రపంచంలో సబ్జెక్టు పై పూర్తిస్థాయి పట్టు సాధించడం, రీజనింగ్ అర్థమెటిక్ స్కిల్స్ పై సాధన చేసినట్లయితే ఉద్యోగాలు సాధించుట సులవన్నారు.
ఈ కార్యక్రమంలో వికాస కాకినాడ కలెక్టరేట్ నుండి వచ్చిన మేనేజింగ్ డైరెక్టర్ శర్మ మాట్లాడుతూ, నేడు ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం యువతకు ఉద్యోగ అవకాశాలను, చదువుచున్న కళాశాలలకే తీసుకుని వచ్చి ఉద్యోగాలను కల్పించుటకు కృషి చేస్తుందన్నారు.
ఈ జాబ్ మేళాకు పానాసోనిక్, టిహెచ్కె, పహర్ పూర్, ఇసుజీ, ఇండో ఎంఐఎం , హుందాయి , కేఐఎంఎల్, యాక్ట్ , ఇంజి , దక్కన్ కెమికల్స్ , ఐసాన్ , యాక్సిస్ బ్యాంక్, ఫాక్సికాన్, టాటా ఎలక్ట్రానిక్స్ మొత్తం 14 కంపెనీలు హెచ్ ఆర్ లు అభ్యర్థులకు రాత,మౌఖిక పరీక్షలు నిర్వహించి 154 మందిని ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్స్ ఇచ్చారు.
ఈ కంపెనీలలో ఎంపికైన వారికి 15-25 వేల రూపాయల వరకు వేతనము ఇస్తారు.ఎంపికైన అభ్యర్థులకు కళాశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి సెక్రటరీ కేవి సీతారామరాజు , ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భాను , అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఏబిఎస్ మూర్తి గవర్నింగ్ బాడీ మెంబర్స్ జయప్రకాష్ నారాయణ , కొర్ర గింజల రవిశంకర్, కంపెనీ హెచ్ఆర్లు రమేష్ , మణి, రోహిత్ , కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్స్ జానకిరామయ్య, మీనా, అధ్యాపకులు ఎన్ రవికుమార్, వర్మ, పవన్ కుమార్, సంతోష్, రాధా మాధవి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.