Telugu News Power

మావుళ్ళమ్మ వారికి బంగారం బహూకరణ.

బంగారు కానుక సమర్పిస్తున్న భక్తులు

భీమవరం: ఫిబ్రవరి,14(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ నిధికి ఆరు గ్రాముల బంగారం శనివారం భక్తులు సమర్పించుకున్నారు. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయ స్వర్ణనిధికి భక్తులు విరివిగా కనకపు కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ సందర్భంగా, స్థానిక పుణ్య దంపతులు, కాసర బ్రహ్మాజీ రావు, శ్రీదేవి 4 గ్రాముల బంగారం, కన్నా బాలసుబ్రమణ్యం రాజు, అనూష 2 గ్రాముల బంగారం అమ్మవారికి కనకపు కానుక సమర్పించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, వేద ఆశీర్వచన పూజలు నిర్వహించారని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి ప్రసాద్ తెలిపారు. ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, బి. నాగభూషణం, ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్, యు. మీనాక్షి, ఏ. ఆంజనేయ ప్రసాద్, జి. శిరీష భక్త దంపతులకు అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదాలు ఆమె చేశారు.