Skip to main content

Telugu News Power

సీబీఎస్ఈ పదో తరగతి బోర్డు పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు.

న్యూఢిల్లీ: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, సీబీఎస్ఈ సోమవారం సాయంత్రం, బోర్డ్ పరీక్షల్లో ముఖ్యమైన మార్పులు ప్రకటించింది. విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించడానికి ఈ కీలకమైన మార్పులు చేస్తున్నట్టు బోర్డు వివరించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతికి రెండు అంచెల బోర్డు పరీక్షలు విధానాన్ని అమలులోకి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకుగాను స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేశారు. మొదటి, పదవ తరగతి బోర్డుపరీక్షలు ఫిబ్రవరిలో జరుగుతాయి. ఈ పరీక్షలకు విద్యార్థులు తప్పక హాజరు కావాలి. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన లేదా అర్హత సాధించిన వారు మెరుగైన ఫలితాలు కోసం, మళ్లీ ప్రయత్నించే అవకాశం కల్పించారు. మ్యాథ్స్, సైన్స్, సోషల్, లాంగ్వేజ్ పరీక్షలలో, గరిష్టంగా మూడు సబ్జెక్టులలో, రెండోసారి పరీక్ష రాసుకోవడానికి అనుమతిస్తారు. మొదటిసారి రాసిన పరీక్షలలో రెండు లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టు పరీక్షలకు హాజరు కాని వారికి మరోసారి పరీక్ష రాసే అవకాశం ఇవ్వరు.