Telugu News Power

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ చారిత్రాత్మక ప్రారంభోత్సవం.

శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ నమూన
అమ్మవారి ఆలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పలుకుతున్న వైజాగ్ బుజ్జి

యలమంచిలి: ఫిబ్రవరి,16(తెలుగు న్యూస్ పవర్) యలమంచిలి ఇలవేల్పు, కోరిన వారికి కొంగు బంగారం, మహిమగల తల్లి శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ పునః నిర్మాణం, పూర్తి చేసుకుంటూ, బింబ, యంత్ర, శిఖర ప్రతిష్టాపన మహోత్సవాలుః మూడు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉద్దండ పండితులు, బ్రహ్మశ్రీ కాళ్లకూరి దుర్గాప్రసాద్ శర్మ, ఆచార్యత్వంలో, బ్రహ్మశ్రీ, యలమంచిలి నరేంద్ర శర్మ, బ్రహ్మత్వంలో ,ఈ విశేష పూజలు జరగనున్నాయి. ఈనెల 18 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు. గణపతి పూజ, యాగశాల ప్రదక్షిణతో, బుధవారం ఉదయం నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మంగళ హారతి, ప్రసాద వితరణ తో సాయంత్రం పూజా కార్యక్రమాలు పరిపూర్ణ అవుతాయి. వాస్తు పూజ, వాస్తు హోమం గురువారం ప్రారంభమై, సాయంత్రం ముగుస్తాయి. గణపతి ప్రార్థనతో శుక్రవారం ప్రారంభమైన పూజలు, ఉదయం10.30 గంటలకు, మూలస్థానేశ్వరి అమ్మవారి యంత్ర బింబ శిఖర ప్రతిష్ట పూజలు జరుగుతాయి. మహాదాశీర్వచనం అనంతరం, నూతన ప్రతిష్టిత పీఠం నుంచి అమ్మవారి ప్రథమ దర్శనం తో భక్తులును అనుగ్రహిస్తారు. ఈ పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులు ఆవు పాలు పువ్వులు పండ్లు కొబ్బరికాయలు ధాన్యం బియ్యం పెసలు మినుములు నల్ల నువ్వులు ఆవాలు తీసుకు వచ్చి యాగశాల వద్ద అందజేయాలి. వాటిని భక్తుల తరఫున యాగంలో వినియోగిస్తారు. ప్రతిష్టా కార్యక్రమాల అనంతరం భక్తులకు అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. అమ్మవారి అనుగ్రహ పాత్రులు, తాళ్లూరి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి, వారి అనుచర భక్తులు ఈ కార్యక్రమం విజయం చేయటానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎప్పటికీ విద్యుత్ దీపాలంకరణ, దేదీప్యమానంగా అమ్మ వారి లయ పరిసరాలకు వెలుగులు విరజింమ్ముతున్నాయి. ఆలయ ముఖ్యమైన పనులు ముగించారు. ఆలయానికివైపులా తాత్కాలిక మెట్లు ఏర్పాటు చేశారు. యాగశాల నిర్మాణం పూర్తయింది. అనునిత్యం ఆవుపాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించడానికి గోమాతను అమ్మవారికి కానుకగా సమర్పించారు. అమ్మవారి మహిమలు ఖండాంతరాలకు వ్యాపించి, భక్తులు అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. ఆమె చల్లని దీవెనలతో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా, అంబరాన్నంటే తీరులో, ఉభయరాష్ట్రలలోనే కాక, ఇతర దేశాలో ఉండే, వారి హృదయాలు కొల్లగొట్టాయి. ఈ మూడు రోజులు యలమంచిలి ఆధ్యాత్మిక చరిత్రలో, సువర్ణ అధ్యయంగా నిలిచిపోనున్నాయి. ఈ మూడు రోజులు భక్తులు విశేషంగా తరలిరావాలని, నిర్వాహకుల తరఫున తాళ్లూరి, వైజాగ్ బుజ్జి భక్తులకు విజ్ఞప్తి చేశారు.