Skip to main content

Telugu News Power

శ్రీశ్రీ శ్రీ మూలస్తానేశ్వరి, వైభవంగా నూతన ఆలయ ప్రవేశ ప్రారంభోత్సవం.

యాగస్థలికి కి అమ్మవారి ఘటాలు

యలమంచిలిని చల్లగా చూసే తల్లి, శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి బింబ,యంత్ర శిఖర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మశ్రీ కాళ్ళకూరి దుర్గాప్రసాద్ శర్మ ఆచార్యతంలో,బ్రహ్మశ్రీ యలమంచిలి నరేంద్ర శర్మ బ్రహ్మత్వంలో ఈ ప్రతిష్టా కార్యక్రమం బుధవారం, వేదపఠం ఘోషతో వైభవంగా ప్రారంభమైంది. గణపతి ప్రార్థన, మంగళ వాయిద్యలతో ఆలయ, యాగశాల ప్రదక్షణం చేశారు. భూతబలి, విగ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ఆరాధన, ప్రోక్షనలు, ప్రాశనలు, ఋత్విక్ వరుణలు, దీక్షాధారణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, అస్త్రరాజార్చన, కళాపకర్షణ, ప్రధాన కలశవాహన, మహాప్రసాద వితరణ కార్యక్రమాలు ఉదయం జరిగాయి. సాయంత్రం మృత్సంగ్రహణము, అంకురారోహణ, మధనాగ్నిచే అగ్ని ప్రతిష్టాపన ఆవరణ, హర్యక్ష మూలమంత్ర హోమముల, ధ్వజారోహణ, చూర్ణికలు, దిగ్దేవతబలిహరణ, మంగళహారతి,ప్రసాద వితరణతో మొదటి రోజు, పూజా కార్యక్రమం సంపూర్ణ అయింది. పలువురు ఋత్వికులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరి శ్రీనివాస్, శిరీష దంపతులు,వైజాగ్ వారితో సహా తొమ్మిది మంది పుణ్యదంపతులు పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతున్నట్లు వైజాగ్ బుజ్జి తెలిపారు. మిగిలిన రెండు రోజులు, భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విరాళాలు ఇచ్చిన దాతల వివరాలు వెల్లడించారు. రెండవ రోజు గురువారం ఉదయం 8.00 గంటల నుంచి కుంకుమ పూజలు ప్రారంభమవుతాయి. పసుపు, కుంకుమ, గంధం, అగరఒత్తులు, తమలపాకులు,వక్కలు నూనే, ప్రమిద మొదలైన పూజా సామాగ్రి భక్తులే తెచ్చుకోవాలి. రవిక,గాజులు కమిటీ వారు అందజేస్తారు.

యాగశాలకు ఋత్వికులు
యాగ పూజలో తాళ్లూరి శ్రీనివాస్ దంపతులు
యాగంలో పాల్గొన్న దంపతులు
యాగస్థలి రథం