
యలమంచిలి: ఫిబ్రవరి,19(తెలుగు న్యూస్ పవర్) శ్రీశ్రీశ్రీ మూలస్థానేశ్వరి అమ్మవారి ఆలయ శిఖర ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు అప్రమత్తతో ఉండాలని, తాళ్ళురి శ్రీనివాస్, వైజాగ్ బుజ్జి విజ్ఞప్తి చేశారు. శిఖరంపై పూజాలు నిర్వహించడానికి తాత్కాలికంగా మెట్లు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ఒకేసారి భక్తులు ఆ మెట్లపై నిలబడడం వల్ల బలం సరిపోక మెట్లు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తెలిపారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే అది అమ్మవారికి, గ్రామానికి మంచిది కాదని తెలుసుకొని, భక్తులు నిగ్రహం పాటించి, చక్కగా లైన్ లో తోచుకురాకుండా, గుంపులుగా ఏర్పడకుండా సాఫీగా ముందుకు సాగాలని, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.