Telugu News Power

ఉచిత కంటి పరీక్షల శిబిరం

ఇంటి ఆరోగ్య శిబిరం లో పాల్గొన్న వైద్యులు అధ్యాపకులు

పాలకొల్లు: స్థానిక శ్రీ ఏ. ఎస్.ఎన్. ఎం. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల రెడ్ రిబ్బన్ క్లబ్,ఎన్‌సి‌సి యూనిట్ మరియు అమరావతి కంటి ఆసుపత్రి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం శుక్రవారం జరిగింది.
ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీ టి. కృష్ణ ప్రధాన అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా కంటి ఆరోగ్యం విద్యాభ్యాసంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
అమరావతి కంటి హాస్పిటల్స్‌ వైద్యు నిపుణులు అహ్మద్ అలీ విద్యార్థులు మరియు సిబ్బందికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి సూచనలు అందించారు. దృష్టి లోపాలు ఉన్న వారికి తగిన చికిత్స, కళ్లజోళ్లు మరియు అవసరమైన వైద్య సహాయం గురించి వివరించారు.
ఈ శిబిరంలో కళాశాల ఐక్యు ఏసి కోఆర్డినేటర్ శ్రీ కె.భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా. వి.యామిని, తెలుగు విభాగాధిపతి డా.బూసి వెంకటస్వామి, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ డా.ఎం. రామకృష్ణ, డాక్టర్ వి.డి.వి. లక్ష్మి, అధ్యాపకులు, డి.మన్మధ రావు, మేనేజర్ డి. స్వరూప్, ఆసుపత్రి సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.