స్థానిక బిఆర్ఆర్ అండ్ జికేఆర్ చాంబర్స్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ సౌజన్యంతో
7 రోజులు పాటు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ జరిగింది.ఈ కార్యక్రమం శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు గారు హాజరై తమ కళాశాలలో విద్యతో పాటుగా, కమ్యూనికేషన్ స్కిల్స్, మెడికల్ కోడింగ్, రీజనింగ్, అర్థమెటిక్ ఆప్టిట్యూడ్, హెచ్ ఆర్ స్కిల్స్ లాంటి వాటిని విద్యార్థులకు అందించుట ద్వారా విద్యార్థులలో పోటీ తత్వం, ఉద్యోగ అన్వేషణ వివిధ రకముల జాబ్ స్కిల్స్ లలో ప్రావీణ్యం సంపాదించుకుని ప్రముఖ సాఫ్ట్వేర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా, బ్యాంకింగ్ మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కైవసం చేసుకుంటున్నారని ఈ శిక్షణకు తృతీయ సంవత్సరం చదువుచున్న 128 మంది విద్యార్థులు పాల్గొనుట మరియు నైపుణ్యం లను పెంచుకొనుట తమకు సంతోషదాయకమని అన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, తమ కళాశాలలో ఏపీ ఎస్ ఎస్ డి సి, ఎం ఎస్ ఎం ఈ , ఉన్నత ఫౌండేషన్, వికాస ఆర్గనైజేషన్ వారి సౌజన్యంతో విద్యార్థులకు జాబ్ స్కిల్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ ప్రిన్యూర్ స్కిల్స్ లాంటి వాటిపై శిక్షణ ద్వారా బ్యాంకింగ్, ఫార్మా , సాఫ్ట్వేర్ జాబ్స్ లలో ఉద్యోగాలు సాధిస్తున్నారన్నారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో ఏపీ ఎస్ ఎస్ డి సి మేనేజర్ కె. రాధిక, ట్రైనర్ లు ఎం . లోకేష్, సిహెచ్. తారక రామ, లక్ష్మి ప్రియలను కళాశాల యాజమాన్యం సత్కరించింది.
ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ శ్రీ కెవి సీతారామరాజు, కళాశాల ట్రెజరర్ ఆర్ ప్రవీణ్ భవన్, కళాశాల అకాడమిక్ అడ్వైజర్స్ శ్రీ ఏబిఎస్ మూర్తి , ఎన్ సీతారామ రావు, అధ్యాపకులు ఎన్ రవికుమార్, రాధా మాధవి, శైలజ, అంజలి తదితరులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు