
పాలకొల్లు/పోడూరు/యలమంచిలి: ఫిబ్రవరి, 22 (తెలుగు న్యూస్ పవర్) గ్రామాల్లో గత ప్రభుత్వం, ఐదేళ్లుగా అభివృద్ధి చేయలేదని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు విమర్శించారు. నియోజకవర్గంలోని, 23 గ్రామాల్లో, ఆదివారం 4.43 కోట్ల రూపాయల నిధులతో రోడ్లు, మురుగు కాలువల పనులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి, ఓ అరుదైన రికార్డు సృష్టించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతికి టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దగ్గర నుంచి అనేక పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. మహిళలు స్వేచ్ఛగా తమ వ్యాపారాలు చేసుకుని అభివృద్ధి చెందటానికి నాట్నుంచి కృషి జరుగుతుందన్నారు. గ్రామాల్లో సమస్యలు తీర్చడానికి కొంత సమయం పట్టినా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అడవిపాలెం (20), ఆర్య పేట (15) దొడ్డిపట్ల (15) యలమంచిలి(10), ఇలపకుర్రు(10), కొంతేరు(58), మేడపాడు (15), ఆగరు (10), ఆగర్తిపాలెం(25), బగ్గేశ్వరం (30), కాపవరం (15), లంకల కోడేరు(20), పాలకొల్లు, గ్రామీణ (30) పెదమామిడిపల్లి (10), పూలపల్లి(20)ఉల్లంపర్రు(10), వరిధనం(15) వెలివెల(15), కొమ్ముచిక్కాల(15), మట్టపర్రు (15), పెనుమదం (25), వద్దిపర్రు (20) లక్షల నిధులు కేటాయించా మన్నారు. మహిళలు పనిచేసే ప్రభుత్వానికి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, రజిని కుమార్, ఉన్నమట్ల కపర్ది, తులా రామలింగేశ్వరరావు, కడలి గోపాలరావు, చెరుకూరి అంజిబాబు, మాతారత్నం రాజు, తాళ్ళ నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.

