Telugu News Power

ఏ ఎస్ ఎన్ ఎం కాలేజీకి 5లక్షల డ్రోన్ మంజూరు.

కళాశాలకు చేరుకున్న డ్రోన్ ప్రదర్శిస్తున్న దృశ్యం

పాలకొల్లు: ఫిబ్రవరి,23(తెలుగు న్యూస్ పవర్)స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాలకు, ఆధునిక డ్రోన్ మంజూరైంది. దీని విలువ దాదాపు 5 లక్షల రూపాయలు. ఈ డ్రోన్ పీఎం–ఉషా జి.ఐ.ఈ.ఐ పథకం, ఎస్.కె.పి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), గుంతకల్లు వారి సహకారంతో,ఏరీస్ ఆగ్రో లిమిటెడ్, ముంబై సంస్థవారి సౌజన్యంతో కళాశాలకు కేటాయించారు. భవిష్యత్‌లో డ్రోన్ పైలట్ శిక్షణ, వ్యవసాయ స్ప్రేయింగ్ ప్రాక్టికల్స్, పంటల పర్యవేక్షణ, ఏరియల్ ఫోటోగ్రఫీ వంటి అంశాలలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ అందించేందుకు ఈ డ్రోన్ఎంతగానో
ఉపయోగపడనుందని
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాజరాజేశ్వరి తెలిపారు. ఆధునిక సాంకేతికత ప్రత్యక్షంగా నేర్చుకోవడం వల్ల వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. స్వయం ఉపాధి కూడా పొందవచ్చునన్నారు.గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడం ఎంతో ముఖ్యమని, డ్రోన్ మంజూరు కావడం కళాశాల విద్యార్థుల అభివృద్ధిలో కీలక ముందుడగని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు భవిష్యత్‌లో సర్టిఫైడ్ డ్రోన్ పైలట్‌లుగా ఎదగాలని ఆకాంక్షించారు.
వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, పీఎం–ఉషా పథకం ద్వారా కళాశాలకు లభిస్తున్న మౌలిక సదుపాయాలు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యసిఏ కోఆర్డినేటర్ కె. భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డా.వి.యామినీ, డా.బూసి వెంకటస్వామి తెలుగు విభాగాధిపతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డా.ఎం. రామకృష్ణ, డా.వి.డి. విజయలక్ష్మి , ఇతర అధ్యాపకులు, విద్యార్థులు డ్రోన్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు..