పాలకొల్లు: ఫిబ్రవరి, 25(తెలుగు న్యూస్ పవర్) జీల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై వారు కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనర్స్ ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 58 మంది అభ్యర్థుల హాజరయ్యారు. ఈ ఎంపికలు ఛాంబర్స్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 14 మంది ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు.జీల్ ఇండియా లిమిటెడ్ హెచ్ఆర్ హెడ్ లు పి వెంకటరామన్ మరియు ఏ హేమభూషణ్లు మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 20 వేల రూపాయల వరకు జీతం మరియు ఇతర సదుపాయాలు ఉంటాయని తెలియజేశారు
ఈ సందర్భంగా చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు మాట్లాడుతూ ఛాంబర్స్ కళాశాలలో చదివిన విద్యార్థులకు డిగ్రీ తో పాటు ఉద్యోగాల కల్పనకు నిరంతర శిక్షణ, భావవ్యక్తీకరణ, కంప్యూటర్ స్కిల్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నామని, అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు ఇస్తున్నామని ఇప్పటివరకు 422 మందికి ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశారని ఫైనల్ డిగ్రీ పూర్తి కాకుండానే విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక కాబడి ప్రముఖ కంపెనీలలో పని చేస్తున్నారని తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వర్ రావు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ జానకిరామయ్య మరియు శ్రీమతి మీనా లు పాల్గొన్నారు.