Telugu News Power

దివిస్ కంపెనీలో 10 మందికి ఉద్యోగాలు.

క్యాంపస్ ఎంపికల సందర్భంగా, మాట్లాడుతున్న ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి

పాలకొల్లు:ఫిబ్రవరి,26(తెలుగు న్యూస్ పవర్) స్థానిక అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ (స్వయం ప్రతిపత్తి) కళాశాల, లో జేకేసీ ప్లేసెమెంట్ సెల్ మరియు రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్‌కు 20 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 10మంది విద్యార్థులు, ఉద్యోగాలకు ఎంపికయయ్యాలరు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజ రాజేశ్వరి హాజరై, ప్రసంగించారు. విద్యార్థులు తమ విద్యకు నైపుణ్యాలు జోడించినప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. పరిశ్రమల అవసరాలను అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవాలని సూచించారు.
వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ మాట్లాడుతూ, దివీస్ వంటి అంతర్జాతీయ స్థాయి ఔషధ సంస్థలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అవకాశాలు కల్పించడం అభినందనీయమనన్నారు. ఐక్యుఏసి సమన్వయకర్త కె. భద్రాచలం నాణ్యమైన విద్య, పరిశోధన దృక్పథం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు.
రసాయన శాస్త్ర విభాగ ఇన్‌చార్జ్ డా. వి. యామిని మాట్లాడుతూ, రసాయన శాస్త్ర విద్యార్థులకు పరిశ్రమలలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ క్యాంపస్ డ్రైవ్ ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకునే వేదిక లభించిందని తెలిపారు.డివీస్ ల్యాబొరేటరీస్ ప్రతినిధి హెచ్.ఆర్. ఏ. రాజేష్ సంస్థ గురించి వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఔషధ రంగంలో డివీస్ ల్యాబొరేటరీస్ విశిష్ట స్థానం సంపాదించిందని, నాణ్యత, క్రమశిక్షణ, సాంకేతిక నైపుణ్యాలు సంస్థకు ప్రధాన బలమని తెలిపారు. విద్యార్థులకు కెరీర్ ఎదుగుదల అవకాశాలు, శిక్షణ విధానం మరియు ఉద్యోగ బాధ్యతలపై సమగ్ర అవగాహన కల్పించారు.
తదుపరి ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష మరియు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించారు. విద్యార్థుల సాంకేతిక పరిజ్ఞానం, ప్రాథమిక రసాయన శాస్త్ర అవగాహన, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించారు. పాల్గొన్న విద్యార్థులు ఉత్సాహంగా స్పందించి తమ ప్రతిభను ప్రదర్శించారు.

జేకేసీ మెంటార్ శిరీష, రసాయన శాస్త్ర విభాగంలోని అధ్యాపకులు వంశీ, దివ్య, కంప్యూటర్ సైన్స్ విభాగానికి చెందిన వేణు మాధురి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచి విజయవంతం చేశారు.