Telugu News Power

నేడే ఆడపిల్లలకు క్యాన్సర్ రాకుండా ఉచిత టీకా.

అమరావతి: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) బాలికల్లో క్యాన్సర్ వ్యాధి నివారణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచితంగా టీకా వేసే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభిస్తారు. బాలికలు యువతుల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు భారతదేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్నది. ఈ వ్యాధి నివారణకు భారత ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్యాన్సర్ ముప్పు 14 -15 ఏళ్ల మధ్య బాలికలకు ఎక్కువగా పొంచి ఉంది. ఇందుకుగాను హెచ్ పి వి టీకా వేసే కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభిస్తారు. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ టీకా ఉచితంగా వేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 6.75 లక్షల మందికి ఉచితంగా దశలవారీగా ఈ టీకా వేస్తారని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.