పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) ఆరోగ్య సమాజ నిర్మాణంలో ప్రజారోగ్య కార్మికుల పాత్ర కీలకమని, మున్సిపల్ కార్మికుల యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బారాయుడు పేర్కొన్నారు. స్థానిక రెల్లిపేటలో శుక్రవారం జిల్లా ప్రథమ మహాసభ ఘనంగా నిర్వహించారు. ఈ సభకు జిల్లా అధ్యక్షులు నెక్కంటి సుబ్బారావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పోరుమామిళ్ల మాట్లాడుతూ, ప్రభుత్వాలు, కోర్టు వారు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకుండా కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తున్నారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు కల్పించాలని, పిఆర్సివేసి వేతనాలు పెంచాలి డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆరోపించారు. నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ, 12 ఏళ్లుగా ఏ ఒక్క కార్మికుడికి కనీసం ఇంటి జాగా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సభలో 21 మందితో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనది. అధ్యక్షులుగా నెక్కంటి సుబ్బారావు, నరసాపురం,ఉపాధ్యక్షులుగా మందుల ముత్తయ్య, నరసాపురం, ఉపాధ్యక్షులుగా గుమ్మడి శ్రీనివాస్, నరసాపురం, ప్రధాన కార్యదర్శిగా తాడికొండ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం, కార్యదర్శిగా ధనాల శ్రీను, పాలకొల్లు, కోశాధికారిగా, నీలాపు శ్రీను, భీమవరం సహా 21 మంది తో కార్యవర్గం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కే. మల్లేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, ఆకుల అప్పారావు గుమ్మడి శ్రీను, పలువురు కార్మికులు పాల్గొన్నారు.
ఆరోగ్య సమాజానికి, ప్రజారోగ్య కార్మికుల సేవలు కీలకం.
మహాసభలో పాల్గొన్న ప్రముఖులు