Telugu News Power

మావుళ్ళమ్మ వారి ఆలయం మంగళవారం మూసివేత.

భీమవరం: సూపర్వైజర్,28(తెలుగు న్యూస్ పవర్) ఈ నెల, 3 న, అనగా ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం మధ్యాహ్నం గం.3: 20ని.ల నుండి సాయంత్రం గం.6:47ని.ల వరకు కేతుగ్రస్త చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేలుపు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ వెల్లడించారు.
ఆ రోజు మంగళవారం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఉదయం, ప్రాతః కాల సహస్ర నామ కుంకుమార్చన, మహా నివేదన.9 గంటలకు లోపుగా ముగించి ఆ వెంటనే ఉదయం 9 గంటలకు ఆలయాన్ని ముసివేస్తారు. పౌర్ణమి రోజు జరిగే విశేష చండీహోమం ఆ రోజు ఉదయం 6 గంటలకే మొదలుపెట్టి 9 గంటలు లోపుగా పూర్తి చేస్తారు. శ్రీ అమ్మవారిఆలయం
4 న బుధవారం సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తారు. శ్రీ అమ్మవారి మూల విరాట్ దర్శనం ఉదయం 8 గంటలకు పునః ప్రారంభిస్తారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు దేవస్థానం చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు తెలియచేసారు.