Skip to main content

Telugu News Power

ఛాంబర్స్ కళాశాలలో “జాతీయ సైన్స్ డే”

ప్రయోగం గురించి వివరిస్తున్న విద్యార్థిని

పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్) భారత తొలి నోబుల్ బహుమతి గ్రహీత, భారతరత్న సర్ సి.వి.రామన్, రామన్ ఎఫెక్ట్ కనిపెట్టిన రోజైనా, ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా స్థానిక ఛాంబర్స్ కళాశాలలో ఉదయం జాతీయ సైన్స్ డే జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన, వైజ్ఞానిక ప్రదర్శన అంశాలను కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతో అవసరం అన్నారరు. ఇలాంటి ప్రదర్శనలు వల్ల విద్యార్థులలో వినూతన ఆలోచనలు తో నవ కల్పనలు, నూతన ఆవిష్కరణలకు అవకాశం కలుగుతుందన్నారు. కళాశాలలో ఆధునిక పరికరాలతో ప్రయోగశాలలు నిర్వహిస్తున్నామని, ఆధునిక సాంకేతికతకు అవి వేదికలవుతున్నాయన్నారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటామని, ఈరోజు సివి రామన్ కనుగొన్న రామన్ ప్రభావం గుర్తుగా ఈ సైన్స్ డే నిర్వహిస్తారని తెలిపారు. శాస్త్రం పై విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడం, శాస్త్రీయ ఆలోచనలు ప్రోత్సహించడం, సమాజాభివృద్ధిలో శాస్త్రం పాత్రను తెలియజేయడం, ఈ సైన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు.
డిగ్రీ మరియు పేజీ విద్యార్థులు ప్రదర్శించిన రసాయన, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ మరియు భౌతిక శాస్త్ర సంబంధిత ప్రదర్శనలను ఆయన తిలకించి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కె. బాబ్జి, కళాశాల అధ్యాపకులు యు జానకి రామయ్య, ఏ. స్పందన, కే. రంజని , ఎం. అంజలి , విజయకుమార్, వర్మ , మీనా తదితరులు పాల్గొన్నారు.