పాలకొల్లు: ఫిబ్రవరి,28(తెలుగు న్యూస్ పవర్)జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా, శనివారం, భీమవరంలోని బివి రాజు డిగ్రీ కళాశాల నిర్వహించిన రాష్ట్రస్థాయి కెమ్ ఎక్స్ ఫ్లోర్ -26లో ఛాంబర్స్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఐ. కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించాడని, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరావు తెలియజేశారు.
కెమ్ లిగో మరియు కెమ్ హంట్ పోటీలు నిర్వహించగా కెమ్ లిగో పోటీలలో కౌశిక్ వర్మ ద్వితీయ బహుమతి సాధించారు. ఈ పోటీలలో 16 కళాశాలలు పాల్గొన్నారు చాంబర్స్ కళాశాల నుండి 12 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు వీరికి టీం లీడర్ గా కెమిస్ట్రీ అధ్యాపకురాలు కుమారి శైలజ హాజరయ్యారు.
బహుమతి సాధించిన కౌశిక్ వర్మను కళాశాల చైర్మన్ శ్రీ కె.వి నరసింహారావు, సెక్రటరీ శ్రీ కేవీ సీతారామరాజు, ట్రెజరర్ ప్రవీణ్ భాను, అకాడమిక్ అడ్వైజర్స్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి, నందుల సీతారామ రావు, అధ్యాపకులు సిబ్బంది అభినందనలు తెలియజేశారు.