Telugu News Power

డిజిటల్ భవన్ సందర్శింన కలెక్టర్.

డ్రోన్ శిక్షణ గురించి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్

మొగల్తూరు: ఫిబ్రవరి,28 (తెలుగు న్యూస్ పవర్) స్థానిక, మత్స్యకారులకు, కలెక్టర్ చదలవాడ నాగరాణి, శనివారం లబ్ధిదారులకు పడవల పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ ఈ పర్యటనలో భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తున్న, నైపుణ్య శిక్షణ కేంద్రం,డిజిటల్ భవన్‌ను కూడా సందర్శించారు. డ్రోన్ టెక్నాలజీ, పచ్చళ్ళ తయారీ వంటి నైపుణ్య శిక్షణల తీరును పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి, వారు నేర్చుకుంటున్న నైపుణ్యాలలో పురోగతిని తెలుసుకున్నారు.
మహిళలు తయారుచేసిన ఉత్పత్తులకు ఆన్లైన్ మార్కెటింగ్ ఎలా చేయాలో స్వయంగా చరవాణి ద్వారా సూచనలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉచితంగా నాణ్యమైన కోర్సులు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. యువత, మహిళలు ఈ అవకాశాలను వినియోగించుకుని తమ ఉపాధి అవకాశాలను విస్తరించుకోవాలని సూచించారు.
డ్రోన్ టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
నైపుణ్య శిక్షణలు భవిష్యత్తుకు బలమైన పునాది అని ఆమె తెలిపారు.