Telugu News Power

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త రహదారి ఎన్ హెచ్ 365 బిజి.

నిర్మాణంలో ఉన్న ఖమ్మం దేవరపల్లి నాలుగు రోడ్ల జాతీయ రహదారి
ఖమ్మం-దేవరపల్లి రూట్ మ్యాప్

న్యూఢిల్లీ:మార్చి,1(తెలుగు న్యూస్ పేపర్) అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం వల్ల దేశవ్యాప్తంగా రోడ్డు కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఆ ఫలాలు ఇప్పుడు దేశానికి అందుతున్నాయి. బిజెపి ప్రభుత్వం రోడ్ల విస్తరణకు, అభివృద్ధికి మారుపేరుగా, ప్రసిద్ధి చెందింది. ఇప్పటి ప్రధాని మోడీ ప్రభుత్వం కూడా అదే పంథా కొనసాగిస్తున్నది. విభజిత ఆంధ్ర- తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ వేసిన ఓ రోడ్డుకు ఎన్ హెచ్-365 బిజి గా నామకరణం చేశారు. ఈ రోడ్డు పొడవు 162 కిలోమీటర్లు. తెలంగాణలో 106, ఆంధ్రాలో 56 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లా తల్లంపెడ నుంచి ప్రారంభమై,ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల మీదుగా,దేవరపల్లి వద్ద కలుస్తుంది. ఈ రోడ్డు వల్ల హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య దూరం తగ్గి, ప్రయాణ సమయం సుమారు 2గంటలు ఆదా అవుతుంది. తెలుగు రాష్ట్రాలలో ఇదే మొట్టమొదటి యాక్సిస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి.ఈ ప్రాజెక్టు 4,481.87 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. పనులన్నీ పూర్తయితే, ఏప్రిల్ నాటికి ఈ రహదారి వినియోగం లోకి రావచ్చని అంచనా వేస్తున్నారు.