హైదరాబాద్: మార్చి, 3(తెలుగు న్యూస్ పవర్. కాం) ఇటీవల ఓ ఇంటి వారైనా సినీ నటుల జంట, విజయ్ దేవరకొండ, రష్మిక మదన్న ల వివాహ వేడుకల సంబరం ఇంకా కొనసాగుతూనే ఉంది. వీరి స్వగ్రామం తెలంగాణలో ని నాగర్ కర్నూల్ జిల్లా, తుమ్మన్ పేటకు, నూతన గృహప్రవేశం, సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు తమ పెళ్ళి కానుకగా, 9,10 తరగతులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్కాలర్షిప్ లు అందజేస్తామని ప్రకటించారు. ఈ ఉపకార వేతనాలు దేవరకొండ ఫౌండేషన్ ద్వారా అందిస్తారు. ప్రభుత్వ వారి 44 పాఠశాలల విద్యార్థులకు అందజేస్తారు.స్కాలర్షిప్ ద్వారా పేద విద్యార్థుల చదువులకు ఉపయోగపడుతుందని హృదయపూర్వకంగా ఈ పెళ్లి కానుక ఇస్తున్నట్టు వారు వెల్లడించారు.
విద్యార్థులకు విజయ్,రష్మికల పెళ్ళికానుక.
స్కాలర్షిప్ ల ప్రకటన చేస్తున్న విజయ్ రష్మిక దంపతులు