ముంబై: మార్చి ,15 (తెలుగు న్యూస్ పవర్. కామ్)
మహారాష్ట్రలోని అహల్యనగర్‌కు చెందిన 19 ఏళ్ల వేద శుక్ల యజుర్వేద పండితుడు దేవవ్రత్ మహేష్ రేఖే సుమారు 200 సంవత్సరాల తర్వాత అత్యంత క్లిష్టమైన ‘దండక్రమ పారాయణం’ పూర్తి చేసి చరిత్ర సృష్టించారు.
ఆయన శుక్ల యజుర్వేదంలోని సుమారు 2,000 మంత్రాలను 50 రోజుల పాటు విరామం లేకుండా, దోషరహితంగా పఠించి, శృంగేరి శారదా పీఠం సహా పలువురి ప్రశంసలు అందుకున్నారు.
వేద పఠనంలో అత్యంత కఠినమైన ‘దండక్రమ పారాయణం’ను 19 ఏళ్ల వయసులోనే పూర్తిచేశారు. వీరు
50 రోజుల పాటు ప్రతిరోజూ 2,000 వేద మంత్రాలను పుస్తకం చూడకుండా, ఎలాంటి తప్పులు లేకుండా పఠించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈయన ప్రతిభను అభినందించారు.
కాశీలో జరిగిన వేడుకలో శేఖర్ ద్రావిడ్ ఘనాపాఠి గారి ప్రత్యేక కృషితో వారికి కాశీలోని
అనేక మంది విద్వాంసుల సహకారం అనేక మంది ఆస్తికుల సహకారముతో
ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు కంకణంతో పాటు, నగదు బహుమతిని అందుకున్నారు.
ఈయన సాధన సనాతన ధర్మం మరియు వేద సంస్కృతిపై యువతకు ఉన్న నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తుంది.