భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రావణం, అనంతరం కాళ్ల శివాలయం అర్చకులు తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ కు సత్కారం చేయుచున్నారు.సాయంత్రం 6 గంటలకు గొల్లలకోడేరు వాస్త్యవ్యులు అవధానరాజహంస సవస్రావధాన భాస్కర అవధానవిద్యా విరించి, కోట వెంకట లక్ష్మి నరసింహం వారిచే ప్రవచన కార్యక్రమం జరుగుతుందని దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం ధరకర్తలు మండలి సభ్యులు అందరి సహకారం తో దిగ్విజయంగా ఉగాది వేడుకలు నిర్వహించడానికి కృషి చేస్తున్నామని తెలియచేసినారు.
