Telugu News Power

దివ్యాంగుల హామీ నేటి నుంచి అమలు-బస్సులో ఉచిత ప్రయాణం.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, గత ఏడాది డిసెంబర్ 3న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో, చర్చించి ఈ పథకానికి నిధులు కేటాయించారు. ఈ పథకాన్ని గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొన్ని బస్సుల్లో సగం ధరకు టికెట్లు రాయితీపై ఇస్తారు. దివ్యాంగులకు ఉన్న అర్హత శాతం బట్టి తోడుగా వచ్చేవారికి సగం ధర రాయితీ టికెట్లు ఇస్తారు. ఈ పథకానికి దివ్యాంగ శక్తి అని నామకరణం చేశారు. ఈ రాయితీలు పొందటానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ యాప్ లో కూడా నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం పట్ల, వారి కుటుంబాల వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

నాడు ఉచిత బస్సు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు