
అమరావతి: మార్చి,18(తెలుగు న్యూస్ పవర్. కామ్) సమాజంలో అందరికంటే ఎక్కువ ఇబ్బందులు పడేది దివ్యాంగులని, వారి సాధికారిక కోసం, దివ్యాంగ శక్తి 11 ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా, మంగళగిరిలో బుధవారం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, కొణిదల పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మాత్యులు నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందన్నారు.ఉగాద, ఈద్ పండుగల ముందుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సమగ్రత మరియు సాధికారతకు ప్రతీకగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుకుందన్నారు. ఈ సందర్భంగా #దివ్యాంగశక్తి అనే పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ, వారికి మెరుగైన రవాణా సౌకర్యం మరియు స్వతంత్రంగా ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు.
ఈ పథకం ప్రారంభ సందర్భంగా, దివ్యాంగులతో కలిసి తొలి ప్రయాణం చేశారు. అనంతరం భోజనం సమయంలో కూడా వారితో స్నేహపూర్వకంగా మాట్లాడారు.
ఈ పథకం ద్వారా 12.76 లక్షలకు పైగా దివ్యాంగులు మరియు వారి సహాయకులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం ముఖ్య లక్ష్యమని తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముందడుగుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత సమగ్రతతో, సాధికారతతో కూడిన సమాజంగా అభివృద్ధి చెందే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వారికి ఉచిత ప్రయాణం టిక్కెట్టు అందజేశారు
