Telugu News Power

క్షీరా రామం పాలకొల్లులో నిత్య అన్నదాన పథకం ప్రారంభించిన మంత్రి

పాలకొల్లు: మార్చి,19(తెలుగు న్యూస్ పవర్. కాం) శ్రీ క్షీరా రామలింగేశ్వర ఆలయంలో ఇక ప్రతినిత్యం దాదాపు 200 మందికి, పండుగ రోజుల్లో 400 మందికి, కార్తీకుమాసం,పుష్కరాలు వంటి తిరుణాళ్ళలో వేల మందికి మహా ప్రసాదం అందజేస్తారని మంత్రి వెల్లడించారు.ఉగాది పర్వదినం సందర్భంగా, గురువారం స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో నిత్య అన్నదాన పథకం స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు చే ప్రారంభోత్సవం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఆలయ మర్యాదలతో, మహా దేవుని దర్శనం చేయించి వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అనిల్, అభిషేక పండిట్ వెంకన్న, మద్ధూరి సూరిబాబు తదితర పండితులను మంత్రి చేతులు మీదుగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, మీసాల రామచంద్ర రావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పర్యవేక్షకులు పి వాసు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్, ఉప్పల పప్పు పెద్దిరాజు, బి సత్యనారాయణ, అన్నదాన సమాజం అధ్యక్షులు తెల్లాకుల కోటేశ్వరరావు, ఉన్న మట్ల కపర్తి, మామిడిశెట్టి పెద్దిరాజు, బోనం నాని, ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

చాలా దానం ప్రారంభిస్తున్న మంత్రి నిమ్మల, మాజీ ఎమ్మెల్సీ అంగర

అర్చకులను సత్కరిస్తున్న మంత్రి