Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ కు రూ. 25 లక్షల హుండి కానుకలు.

భీమవరం: మార్చి,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక పట్టణం లోని
ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి హుండీలు తెరచి బుధవారం లెక్కించారు. గడచిన 26 రోజుల కాలానికి, హుండీల ద్వారా
రూ. 25,63,619/- రూపాయలు భక్తులు మావుళ్ళమ్మ కు కానుకలుగా సమర్పించుకున్నారు. బంగారం 30.200 గ్రాములు, వెండీ 55 గ్రాములు శ్రీ అమ్మవారికి హుండీల ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరిచారు. కాకినాడ పట్టణం ఎంఎస్ఎన్ చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు, పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు
బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ,, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు,రామాయణం శ్రీనివాస్,ఉదీశి మీనాక్షి, , జి రమణ, మిర్తిపాటి గుణేశ్వరరావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల మత్యపురి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రఘునాథ్, కలిగొట్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి మంతెన రామరాజు మరియు కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది
ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు…స్థానిక భీమవరం కు చెందిన సేవకులు తో పాటుగా, విజయవాడకు చెందిన ప్రముఖ సేవకులు, ఆర్మీ ఉమా మహేశ్వరావు ఆధ్వర్యంలో. కరీంనగర్, నల్గొండ, వరంగల్ చెందిన వందమంది సేవకులు హుండీ లెక్కింపు కార్యక్రమం లో సహకారం అందించారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నగేష్ తెలిపారు.