పాలకొల్లు: మార్చి, 30(తెలుగు న్యూస్ పవర్.కాం) పంచారామ క్షేత్రం, స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయాన్ని సోమవారం స్థానిక ఎంపీ, కేంద్రమంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ మర్యాదలతో సత్కరించి, వేద ఆశీర్వచన పూజలు.
ఆలయఅర్చకులు క్రిష్టప్ప ,అనిల్ లు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాలు పురస్కరించుకుని మాంటిసోరి పాఠశాల, అధినేత కలిదిండి కృష్ణ వర్మ సౌజన్యంతో వందమంది పురోహితులకు మంత్రివర్మ వస్త్ర దానం చేశారు. ధర్మకర్తల అధ్యక్షులు మీసాల రామచంద్రరావు, కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు స్వామి వారి చిత్రపటాన్ని కేంద్రమంత్రికి అందజేశారు, బిజెపి నాయకులు ఎర్రంశెట్టి పద్మారావు, జక్కంపూడి కుమార్, రంగయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రమంత్రి వర్మచే, పురోహితులకు వస్త్రదానం.
స్వామివారి చిత్రపటం స్వీకరిస్తున్న కేంద్రమంత్రి వర్మ