Telugu News Power

ముంబై టూర్ సక్సెస్: టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్ వెల్లడి.

పెట్టుబడిదారులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న మంత్రి కందుల దుర్గే

ముంబై: ఏప్రిల్ ,10 (తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టూరిజం శాఖ మాత్యులు కందుల దుర్గేష్, రెండు రోజులపాటు జరిగిన
హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
గ్రాండ్ హైట్ హోటల్‌లో జరిగిన 21వ హోటల్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఆసియా ఈ కార్యక్రమం మించింది. దేశీయ, విదేశీ ప్రముఖ ఇన్వెస్టర్లతో భేటీ అయ్యారు.ఎరోస్ ఇన్నోవేషన్, రెడ్ బుల్, అమర్ చిత్ర కథ, శ్రేమ్ గ్రూప్, అక్కోర్, హైట్ హోటల్స్, బ్రిగేడ్ గ్రూప్, లెమన్ ట్రీ హోటల్స్, ఓబెరాయ్ గ్రూప్, ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ వంటి ప్రముఖ కంపెనీలతో చర్చలు జరిపారు.
ఎరోస్ ఇన్వెస్టర్లతో మాట్లాడి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒక నెల్లో అవగాహన ఒప్పందం పై సంతకం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఒలివ్ గ్రూప్‌తో రూ. 500 కోట్ల ఎం ఓ యు, రాష్ట్రవ్యాప్తంగా 3 సంవత్సరాల్లో 2వేలకు పైగా హోటల్ రూములు వస్తాయని ఆశ బాబు వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదిత్య రంగానికి ఎంతగానో ఆడ్పడుతుందని మంత్రి ఆకాంక్షించారు.