గుంటూరు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కాం) ప్రముఖ సినీ నటులు, మాజీ ఎంపీ, పద్మశ్రీ, మాగంటి మురళీమోహన్ తన పేరుపై ఏర్పాటు చేసిన అవార్డును, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్ పర్సన్ పొడపాటి తేజస్వినికి శనివారం, స్థానిక బృందావన్ గార్డెన్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి
ఆలయంలో జరిగిన పురస్కార ప్రధాన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ, తేజస్వి ఆంధ్ర రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. తన వ్యక్తిగత అభిరుచి కూడా ఇందుకు తోడువుతుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీస్సులు అందించారు.
‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత మాగంటి మురళీమోహన్ చేతుల మీదుగా ‘మురళీమోహన్ పురస్కారాన్ని’ అందుకున్నందుకు, ఏపీ కల్చర్ కమిషన్ ఛైర్పర్సన్ పొడపాటి తేజస్వి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మురళీమోహన్ చూపిన సేవా పథం, ఎన్టీఆర్ అందించిన కళావారసత్వం తన ముందుకు నడిపిస్తాయని తేజస్వి వెల్లడించారు. రంగస్థలం కళాకారుల కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాట్రగడ్డ రామకృష్ణ, బొప్పన నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
