పాలకొల్లు: ఏప్రిల్, 11(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. స్థానిక హౌసింగ్ బోర్డ్ లో ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జాతీయ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో తరగతులను, మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సినీ పరిశ్రమ స్థాపించాలనుకున్న పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి సంబంధించి ఏ ప్రభుత్వ సాయం కావాలన్నా చేయడానికి కృషి చేస్తామన్నారు. చిత్ర పరిశ్రమ స్థిరపడటానికి, స్టూడియోలు, డబ్బింగ్,రీ రికార్డింగ్ వంటి సదుపాయాల అభివృద్ధికి తీవ్రంగా కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో షూటింగ్లు జరుపుకోవడానికి నిబంధనలు ఇప్పటికే సరళతరం చేశామన్నారు. పారిశ్రామికవేత్తలకు, వివిధ రాయితీల ద్వారా సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు. మారేడుమిల్లి, అరకు లోయ, తిరుపతి వంటి ప్రాంతాలు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమ మరింత అభివృద్ధి చెంది, ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి జరుగుతుందన్నారు. నంది నాటకోత్సవాలకు, అవార్డుల ప్రధానోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. పద్య నాటకాలు, రంగస్థల కళలకు ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తామన్నారు. కళాకారులకు ప్రభుత్వం తగినంత గుర్తింపు ఇస్తుందన్నారు. రాజమండ్రిలో, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, శాఖ ఏర్పాటుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. పాలకొల్లు కీర్తి ప్రతిష్టలను దాసరి నారాయణరావు లాంటి ఎందరో సినీ కళాకారులు ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లారని ప్రశంసించారు. ఈ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, ప్రసిద్ధ పూనే ఫిల్మ్ ఇనిస్ట్యూట్ తో పోటీపడే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనుల శాఖ మాత్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఫిలిం ఇన్స్టిట్యూట్ ద్వారా స్థానిక కళాకారులు అధిక సంఖ్యలో తయారు కావడానికి, వారి నట కౌశల్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇన్స్టిట్యూట్ నిర్వాహకుల కృషి ని అభినందించారు. నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, నిర్మాతలకు 200 చిత్రాల వరకు మాత్రమే ఇస్తున్న ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇంకా పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖ నటులు, శ్రీకాంత్ మాట్లాడుతూ, పాలకొల్లు నుంచి ఎందరో గొప్ప కళాకారులు, సాంకేతిక నిపుణులు తయారు కావడానికి ఈ శిక్షణా సంస్థ ఆలమ్మన కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా, మంత్రులు, ఇన్స్టిట్యూట్ గౌరవ సలహాదారు, అధ్యక్షులు, చేగొండి హరి రామ జోగయ్య, గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజులను సత్కరించారు. ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్, స్వాగతోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రేలంగి నరసింహారావు, విఎన్ ఆదిత్య, పైడిపాడు రాజేంద్ర కుమార్, నిర్మాత తుమ్మలపల్లి రమా సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు, సమస్త కార్యవర్గ సభ్యులు, కేసిరాజు రాంప్రసాద్, డాక్టర్ వర్మ, కలిదిండి గణపతిరాజు, రమేష్ రాజ, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, చవాకుల సూర్య నరేష్, ప్రిన్సిపల్ రాజ వన్నెంరెడ్డి, గుడాల హరిబాబు, బందెల భాస్కరరావు తదితరులు పాల్గొన్నార
