Telugu News Power

సెమిస్టర్ ఫలితాల్లో చాంబర్స్ విద్యార్థుల ప్రతిభ.

విద్యార్థులను అభినందిస్తున్న కాలేజీ కమిటీ

పాలకొల్లు: ఏప్రిల్, 12(తెలుగు న్యూస్ పవర్. కామ్)@ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ 3వ సెమిస్టర్ ఫలితాలలో ఛాంబర్స్ విద్యార్థుల తమ ప్రతిభ కనబరిచారు.
విద్యార్థులు 83శాతం ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు సోమవారం తెలియజేశారు.
విశ్వవిద్యాలయ పరిధిలో ఉత్తమ ఫలితాలు సాధనలో ఛాంబర్స్ కళాశాల వరుసలో ఉందన్నారు.ఈ విధంగా 9.2 నుండి 9.8 మధ్యలో గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులు 35మంది ఉన్నారు. .
కళాశాలలో అత్యుత్తమ బోధన , ప్రమాణాలు కొనసాగిస్తూ ఆధునిక సాంకేతిక విధానాలలో విద్యార్థులను తీర్చుదిద్దుటలోనూ నూతన విద్యా విధానం -2020 సక్రమంగా నిర్వహించుటలోనూ కళాశాల ముందంజలో ఉందని చైర్మన్ శ్రీ కెవిఆర్ నరసింహారావు గారు తెలిపారు.ఈ సందర్భంగా, ఉత్తమ గ్రేడ్ పాయింట్స్ సాధించిన విద్యార్థులను కళాశాల చైర్మన్ శ్రీ కె.వి.ఆర్ నరసింహారావు, సెక్రెటరీ కె.వి సీతారామరాజు, అకాడమిక్ అడ్వైజర్స్ ఏబీఎన్ మూర్తి , నందుల సీతారామరావు, ప్రిన్సిపాల్ డాక్టర్.డి.వెంకటేశ్వరరావు, అధ్యాపకులు అభినందించారు.
ఇంత ఉత్తీర్ణతకు విద్యార్థులను తయారుచేసిన అధ్యాపకులకు కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపినారు.