
యలమంచిలి: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రజలు, రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తుందని స్థానిక శాసనసభ్యులు నిర్మల రామానాయుడు పేర్కొన్నారు. యలమంచిలి, ఊటాడ గ్రామాల్లో రూ. 9.21 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా యలమంచిలి లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు సురక్షిత మంచినీరు అందించడం కోసం నేరుగా విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలను పైపులైను ద్వారా తీసుకువచ్చే కోట్లాది రూపాయల భారీ ప్రాజెక్టుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులు తమ ధాన్యం అమ్ముకున్నప్పుడు గతంలో ఏళ్ల తరబడి డబ్బులు వచ్చేవి కావని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతులకు గంటలోనే డబ్బు జమ చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం 20 నెలల కాలంలో కోట్లాది రూపాయలు వెచ్చించి పనులు చేపట్టిందన్నారు. జగన్ ప్రభుత్వం అరాచక పాలకు మరోసారి అవకాశం ఉందని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల సంక్షేమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న కూటమి ప్రభుత్వానికి ఎన్నికలోనైనా ఏకగ్రీవ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు కొక్కిరిగడ్డ జయరాజు, తాళ్లూరి శ్రీనివాస్, మండల తెలుగు రైతు చెరుకూరి అంజిబాబు, నీటి సంఘం అధ్యక్షులు ఆరమిల్లి రామ శ్రీనివాస్, మాతా రత్నం రాజు, సొసైటీ అధ్యక్షులు చిలుకూరు బాలాజీ, బొప్పన హరికిషోర్, రుద్రరాజు సత్యనారాయణ రాజు, ఏఎంసీ మాజీ చిట్టూరి ఆంజనేయులు, మామిడి శెట్టి పెద్దిరాజు, కొడవటి వరబాబు, బోనం నాని, కాసా సత్య, బొప్పన సురేష్, ఎమ్మార్వో గ్రంధి పవన్ కుమార్, ఎంపీడీవో జక్కంశెట్టి ప్రసాద్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.