
సింహాచలం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ముఖ్యఘట్టమైన, చందన సేకరణ కార్యక్రమం ఆలయ ప్రధాన అర్చకులు, అలంకారీ పురోహిత్ సీతారామరామ స్వాములవారు సోమవారం ప్రారంభించారు. సుమారు 32 కిలోల చందన ఖండములను సాన పై గంధం తీయడానికి ఉపయోగిస్తారు. సేకరించిన ఈ పవిత్ర చందనం శ్రీ వరాహ నరసింహస్వామి వారి రూపు దాల్చడం ప్రపంచంలోనే ఒక అద్భుత వింత.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో చందనోత్సవం (నిజరూప దర్శనం) ఏప్రిల్ 20, అక్షయ తృతీయ రోజు జరగనుంది.
దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రకారం, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రకారం పక్కా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 80 శాతం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి, ఏప్రిల్ 15 నాటికి అన్ని పనులు ముగిసి, 19న అంతా సిద్ధం చేస్తారు. క్యూ లైన్లు, భద్రత, వసతిపై ప్రత్యేక దృష్టి. ఏప్రిల్ 19 సాయంత్రం 7 గంటల నుంచి సాధారణ దర్శనాలు నిలిపి, ఆలయ శుద్ధి చేస్తారు.
టికెట్ విక్రయ 70 శాతం ఆన్‌లైన్లో (http://chandanotsavam.ap.gov.in). ధరలు: రూ.300, రూ.1000. ఆన్‌లైన్ బుకింగ్ ఏప్రిల్ 12 నుంచి 17 వరకు. ఆఫ్‌లైన్: SBI (సింహాచలం, బిర్లా జంక్షన్), యూనియన్ బ్యాంక్ (సింహాచలం, అక్కయ్యపాలెం) బ్రాంచిలలో ఏప్రిల్ 13 నుంచి 17 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. స్లాట్ సిస్టమ్, క్యూ ఆర్ యాక్సెస్తో వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు పొందవచ్చు.
ఇతర ముఖ్య విషయాలు చందనం అరగదీత, ఆలయ శుద్ధి కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. భక్తులు టైమింగ్స్ పాటించాలని దేవస్థానం వారు సూచించారు.
చందనోత్సవం. టికెట్లు ఇప్పటికే విక్రయంలో ఉన్నాయి, అయితే కొంత సాంకేతిక సమస్య ఏర్పడినట్లు, త్వరలోనే పరిష్కరిస్తామని ఆలయ యువ సోమవారం తెలిపారు. గత విషాదకర అనుభవాల దృష్ట్యా
ప్రభుత్వం పటిష్ట భద్రత, సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, పోలీసులనుతాధికారులతో సింహాచల క్షేత్రం పర్యటనలో అధికారులకు భక్తుల భద్రతపై పలు సూచనలు చేశారు.