Telugu News Power

భారత దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే దిక్సూచి.-మంత్రి నిమ్మల రామానాయుడు.

భారతరత్న అంబేద్కర్ జయంతి సభలో అబ్దుల్ కలాం పార్క్ వద్ద మాట్లాడుతున్న మంత్రి నిమ్మల
యలమంచిలి మండలం ఏనుగు వాణి లంకలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వినుకొండ ధనలక్ష్మి రవికుమార్

పాలకొల్లు: ఏప్రిల్’14(తెలుగు న్యూస్ పవర్. కామ్)
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దశ, దిశ నిర్దేశించి దిక్సూచి లాంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు, భారతరత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ 135 వ జయంతి పురస్కరించుకుని,స్థానిక అబ్దుల్ కలాం ఆరోగ్యం వనం వద్ద నిర్మించిన అంబేద్కర్ గొడుగు నిర్మాణానికి మంగళవారం మంత్రి ప్రారంభోత్సవం చేసి, ప్రసంగించారు. అంబేద్కర్ పుట్టినరోజు భారతీయులందరికీ పండగ రోజు అని తెలిపారు. భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలతో ఉన్న భారతీయ సమాజాన్ని ఏకతాటిపై నడిపిస్తున్న భిన్నత్వంలోనే ఏకత్వ సిద్ధాంతం అయిన అంబేద్కర్ విరచిత భారత రాజ్యాంగ ఫలమన్నారు. అంబేద్కర్ యొక్క ఆశయాలు పుస్తకాల్లో కాకుండా, ఆచరణలో, పాలనలో ప్రస్ఫుటించాలని సూచించారు. అంబేద్కర్ అందరికీ స్ఫూర్తి ప్రదాత అని, తనకు ఇష్టమైన ఇద్దరు మహనీయులలో సమ సమాజ ఆవిష్కరణ కోసం కృషి చేసిన అంబేద్కర్, ప్రపంచంలో సేవా స్ఫూర్తి కి మారుపేరైన మదర్ థెరిసా బాటలో నడుస్తూ, 2005 నుంచి రాజకీయాలకు అతీతంగా,తన తండ్రి ధర్మారావు ఫౌండేషన్ పేరిట సమాజ సేవ చేస్తున్నానని వివరించారు. మహనీయుల విగ్రహాలు చూసి భావితరాలు తల ఎత్తి గౌరవించే విధంగా వారికి రూఫ్ షెల్టర్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. అబ్దుల్ కలాం ఆరోగ్య వనంలో రాబోయే రోజుల్లో బోటు విహారం, జిమ్ తదితర సౌకర్యాలతో 10, 11 వార్డులకు తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. పాలకొల్లుకే ఈ పార్క్ స్మార్ట్ పార్కు కాబోతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావ్, ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పెచ్ఛెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కర్నూల్ నాయుడు, బోనం చినబాబు, ఉన్నమట్ల కాపర్ది, కొల్లి కొండ ప్రసాద్, తులా రామలింగేశ్వరరావు, పసుపులేటి రాజేష్ ఖన్నా, ఎస్తేరు రాణి, ఉన్నతి సురేష్ , బత్తుల మేరీ నిర్మల్ కుమారి, దాసరి రత్నం రాజు, పీతల ఆనంద్, దొరబాబు, వెంకట్ రెడ్డి, కోలాటి పెద్దిరాజు, ప్రేమ్ కుమార్, నవ చైతన్య యూత్, స్థానిక నాయకులు, యువకులు పాల్గొన్నారు.