పాలకొల్లు: ఏప్రిల్, 15(న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ, పకృతి వ్యవసాయ శాఖ సిబ్బందికి కి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు వ్యవసాయ అధికారి పి మురళీకృష్ణ వెల్లడించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ, కోతల పూర్తయ్యాక వరి చేలో పచ్చిరొట్టపైరు విత్తనాలు చల్లాలని సూచించారు. ఇందుకు, నవధాన్యపు కిట్లను వేయాలని తెలిపారు. భూమి ఖాళీ ఉండకుండా, పచ్చి రోట్ట తో కప్పినట్లయితే భూమిలోని పోషకాల, సూక్ష్మజీవులు నష్టపోకుండా ఉంటాయన్నారు. ఈ పచ్చిరొట్ట ను భూమి లో కలియదున్నటం వలన భూమికి పోషక విలువలు పెరుగుతాయన్నారు. సేంద్రియ కర్బణ పదార్థం పెరుగుతుందని వెల్లడించారు. రసాయన ఎరువులను తగ్గించుకోవచ్చునన్నారు. దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. నవధాన్యాలు ఎకరానికి 10 కేజీలు చొప్పున వేసుకోవాలి. ఇవి నానబెట్టి కోతకు ఏడు లేదా ఐదు రోజులు ముందు చేలో చల్లుకోవాలిని. కోత తర్వాత గడ్డిని తగలబెట్టకూడదని, తగలబెట్టడం వల్ల వాతావరణంలో కార్బన్ మోనాక్ససైడ్ కలవడం వల్ల శ్వాస కోశ వ్యాధులు వస్తాయి. ఈ యొక్క వేడికి భూమి ఫై పొరలలో ఉన్న సూక్ష్మజీవులు, సూక్ష్మపోషకాలు నష్టపోతాయని తెలిపారు. ఈ నవధాన్యాలు 10 కేజీల కిట్టు రూ.700 లు మాత్రమే. ఏవో రాజశేఖర్ మాట్లాడుతూ, మండలంలో అన్ని చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. రైతులందరూ కోసిన ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాల ద్వారా నచ్చిన మిల్లుకి అమ్ముకోవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో పకృతి వ్యవసాయ శాఖ నుంచి ఎం అప్పారావు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ వీఏ ఏలు మరియు పకృతి వ్యవసాయ విభాగం సభ్యులు పాల్గొన్నారు.
వ్యవసాయ శాఖ సిబ్బందికి శిక్షణ.
రైతు సమావేశంలో మాట్లాడుతున్న
పి. మురళీకృష్ణ