
పాలకొల్లు: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్ కం) రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జలవనరుల శాఖ మహత్యం నిమ్మల రామానాయుడు సూచన మేరకు వారికి క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలుగుదేశం నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ బంగారం రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మారావు పౌండేషన్ ద్వారా పేదలకు దివ్యాంగులకు బియ్యం దుప్పట్లు పంపిణీ చేశారు. ధర్మారావు ఫౌండేషన్ రక్తదాన 111 శిబిరం ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెచ్చెట్టి బాబు, విజయ భాస్కర్, గండేటి వెంకటేశ్వరరావు, కన్నీటి గౌడ్ నాయుడు దంపతులు, ఉన్నమట్ల కపర్తి, మామిడి శెట్టి పెద్దిరాజు, పీతల శ్రీనివాస్, కడలి గోపి, దాసరి రత్నం రాజు, పాలవలస తులసిరావు, పూల రజిని కుమార్, పెనుమత్స రామంభద్రరాజు భారీగా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు.
