Telugu News Power

అగ్నిమాపక వారోత్సవాల ముగింపు.

నిర్వహించిన పోటీల్లో మాత్రం అందజేస్తున్న అధికార్లు దుర్గా కిషోర్, జానకి రామ్

పాలకొల్లు: ఏప్రిల్, 20(తెలుగు న్యూస్ పవర్. కామ్) అగ్నిమాపక దళం గతవారం రోజులగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమం సోమవారం ముగిసింది. జిల్లా అగ్నిమాపకదళ సహాయ అధికారి వైవి జానకిరామ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ముగింపు సభలో తహసిల్దార్ యడ్ల దుర్గ కిషోర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపకదళం ప్రజలకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన కల్పించడం వల్ల అగ్ని ప్రమాదాల వల్ల నష్టం జరగకుండా నివారించడానికి ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన చిత్రలేఖ నం పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతులు అందజేశారు. ప్రమాదం జరిగినప్పుడు వాడే వివిధ పరికరాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ సిబ్బంది, చాతుర్య స్కూల్ సిబ్బంది, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.