అమరావతి: ఏప్రిల్,20(తెలుగు న్యూస్ పవర్. కామ్) ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డిని సోమవారం ప్రభుత్వం డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో సి సి ఏ నిబంధనకు వ్యతిరే కులు పనిచేసినందుకు ఎన్నికల సంఘం వారిని సస్పెండ్ చేసింది.గత ఎన్నికల్లో వైసీపీ తరఫున వెంకటరామిరెడ్డి నిర్భయంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పులి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు వెంకట్రామిరెడ్డి ప్రవర్తన పట్ల విస్మయం వ్యక్తం చేశాయి. సుదీర్ఘ విచారణ అనంతరం వారిని సి సి ఏ నిబంధనల అతిక్రమణ మేరకు ఉద్యోగం నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందువల్ల వారికి రావలసిన పదవి విరమణ ప్రయోజనాలు ఏవి దక్కవు. నిబంధనల గీత దాటి క్రమశిక్షణ ఉల్లంఘించిన వారికి వీరి ఉద్యోగ తొలగింపు అవుతుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.
నా ఉద్యోగం పోయిందండి. -వెంకట్రామిరెడ్డి
నాటి ముఖ్యమంత్రి జగన్ తో వెంకట్రామిరెడ్డి (దాచిన చిత్రం)