Skip to main content

Telugu News Power

మహిళలు వైసిపి లెక్క తేల్చాలి. -మంత్రి నిమ్మల రామానాయుడు

దొడ్డిపట్ల సభలో మాట్లాడుతున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఏప్రిల్, 22(తెలుగు న్యూస్ పవర్. కాం) గత ప్రభుత్వంలో పాలకొల్లు నియోజకవర్గంలో గ్రామం నుంచి మండలం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పడకేసిన అభివృద్ధి గురించి వైసిపి పార్టీ లెక్క తేల్చాలని మహిళలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరురల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు పోడూరు, యలమంచిలి మండలాల్లో రూ.4.15 కోట్లతో పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా, దొడ్డిపట్ల లో జరిగిన సభలో మంత్రి ప్రసంగించారు. నాటి వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఓట్లు వేసిన వారు, మరోసారి అలాంటి పొరపాటు చేయవద్దు అని కోరారు. పని చేసే ప్రభుత్వానికి తమ ఏకగ్రీవ మద్దతు తెలపాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఎండనక వాననక, ఎప్పుడు సమయం దొరికిన నియోజవర్గ అభివృద్ధి పనుల్లో పాల్గొంటున్నట్టు మంత్రి వెల్లడించారు. తీర ప్రాంతానికి అత్యంత మాదకరమైన ఏటి గట్లు పఠిష్టపరచటం, గ్రోయిన్స్ కు 18 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం తీర ప్రాంత ప్రజల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గత వైసిపి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఈ పనులకు కేటాయించలేదని ఆరోపించారు. అభివృద్ధిని ఆమడ దూరంలో ఉంచి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పార్టీని అధికారానికి దూరంగా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచ్ చేగొండి రవిశంకర్, బోనం నాని, బోనం శ్రీ రామకృష్ణ, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరి కిషోర్, డేగల సత్తి కొండ, పెనుమత్స రాంబద్ర రాజు, ఉన్న మాటలు కాపర్తి, వాసు, గొట్టుముక్కలు సూర్యనారాయణ రాజు, మామిడిశెట్టి పెద్దిరాజు, ఆ. రామ్ శ్రీనివాస్, కడలి గోపి, మాత రత్నరాజు, చిట్టూరి రాంజనేయులు, తాళ్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.