Skip to main content

Telugu News Power

గోదారోళ్లకు వెటకారమే కాదు, మానవత్వం మీద మమకారం కూడా ఎక్కువే.

రావులపాలెం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) గోదారోళ్లంటే ఆతిధ్యానికి పెట్టింది పేరు. వారికి కాస్త వేటకారం కూడా ఎక్కువే. వారిలో మరో కోణం మానవత్వం పై మమకారం. ఎందుకు ఉదాహరణే శుక్రవారం జరిగిన ఓ సంఘటన. రాజమండ్రి నుంచి మూలస్థానం అగ్రహారం వైపు మంచినీటి సీసాలతో వెళుతున్న ఒక మినీ వ్యాను అదుపుతప్పి డివైడర్ను ఢీకొని బోల్తా కొట్టింది. వెంటనే అక్కడున్నవారు డ్రైవర్ను బయటకు తీశారు. వోల్టా కొట్టిన నిలబెట్టి, హైవే మీద రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. వాటర్ బాటిల్లు అందుకని దూసుకుపోకుండా ప్రతి ఒక్కరూ తలు చేయి వేసి బాటిల్ అన్ని రోడ్డుకి ఇరువైపులా పేర్చారు. ఈ సంఘటన సాటి మనిషికి సాయం చేయాలని మానవత్వం ఇంకా నిలిచి ఉందని నిరూపించింది.

 

వాటర్ బాటిల్స్ పోవేస్తున్న దృశ్యం