Telugu News Power

హైదరాబాద్ కు ఆదివారాల రైలు రేపటి నుంచి ప్రారంభం.

నరసాపురం: ఏప్రిల్, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్) లోక్ సభ స్థానం ప్రధాన కేంద్రం నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్లే రైలు ప్రయాణికుల కోసం మరో వారాంతపు రైలు సేవలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. స్థానిక ఎంపీ, కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కృషితో ఈ ప్రాంతానికి రైల్వే సౌకర్యాలు మీరు అవుతున్నాయి. వీరి కృషితో
నరసాపురం – హైదరాబాద్ మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచే దిశగా మరో ముందడుగు పడింది. నరసాపురం – చర్లపల్లి (17061 / 17062) వారాంతపు ఎక్స్‌ప్రెస్ రైలును రేపటి (ఆదివారం) నుంచి రాత్రి 8 గంటలకు నరసాపురం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది.
ఆధునిక కోచ్‌లు, ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఈ రైలును అత్యాధునిక రేక్స్ అప్‌గ్రేడ్ చేసిన కోచ్‌లు ఉంటాయి..అత్యాధునిక వసతులతో అందుబాటులోకి వస్తున్న ఈ రైలు సేవలను ప్రయాణికులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు మంత్రి వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రైలు సర్వీస్ అందుబాటులోకి రావడం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.