పాలకొల్లు: ఏప్రిల్, 27(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో 9నెలలకు సరిపడ ఇంధన నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ, ఎందుకు ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని పాలకొల్లు, భీమవరం వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాలరావు ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో గుడాల గోపి ఇంధన సరఫరా ఇబ్బందులపై మాట్లాడారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యే ప్రసాద రాజు, సీనియర్ నాయకులు గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి, మంత్రులు బ్లాక్ మార్కెట్ చేయాలనుకుంటున్నారా తీవ్రంగా ఆరోపించారు. ప్రజలు బంకుల వద్ద ఎండలో మాడుతుంటే, మంత్రులు ఏసీల్లో చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన 40 ఏళ్ల అనుభవం ఏమైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెంబర్ 2 గా ఉన్న మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబు దగ్గరకు వెళ్లి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చవడం లేదని ఆగ్రహం చేశారు. సమస్యను పరిష్కరించడానికి తాము ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని, కడవరకు పోరాడుతామని హెచ్చరించారు.

ఇంధన కొరతపై సమావేశంలో మాట్లాడుతున్న గుడాల గోపి