పాలకొల్లు: మే, (తెలుగు న్యూస్ పవర్. కామ్). ఈనెల 8 నుంచి ఒక్క పూట మాత్రమే రక్షిత మంచినీరు సరఫరా జరుగుతుందని పొరపాలక సంఘ కమిషనర్ విజయ సారథి మంగళవారం ప్రకటించారు. ప్రతిరోజు ఉదయం గం. 6 నుంచి గం.7 వరకు నీటి సరఫరా జరుగుతుందన్నారు. సాయంత్రం పూట నీటి సరఫరా జరగదని వెల్లడించారు. రైతులకు అవసర మైన సాగునీటి సరఫరా కోసం కాలువల తవ్వకం, వంతెనల నిర్మాణం వంటి పనుల వల్ల కాలువలకు నీటి సరఫరా నిలిపివేసినందున ఈ పరిస్థితి ఎదురయిందన్నారు. పురప్రజలు రక్షిత మంచినీరు కేవలం త్రాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. కుళాయినీరు కోసం అక్రమంగా జనరేటర్ల వాడితే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని, అందువల్ల అందరికీ నీరు అందడానికిగాను జనరేటర్ల వాడకం నిషేధించినట్టు తెలిపారు. రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు నిమ్మల రామానాయుడు, కృషి వల్లవచ్చే ఏడాది నుంచి ఈ సమస్య ఉండదన్నారు. గోదావరి నుంచి నేరుగా పైప్ లైన్ ద్వారా మంచినీరు సరఫరాకు ప్రాజెక్టు సిద్ధమైందన్నారు. ఇందుగ్గాను రూ. 119 కోట్లు మంత్రి నిమ్మల కేటాయించారన్నారు. ఈ పనుల కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైంది అన్నారు.
పుర ప్రజలు మంచినీటి సరఫరా సక్రమంగా అందరికీ అందటానికి సహకరించవలసిందిగా కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఒక్క పూట మాత్రమే కుళాయినీరు. -పురప్రజలు సహకరించాలి కమిషనర్ విజయ సారధి.
పురపాలక సంఘ కమిషనర్ విజయసారధి