Telugu News Power

గ్రంధాలయాలకు దేవినేని పుస్తకాల వితరణ.

దేవినేని మధుసూదనరావు నుంచి పుస్తకాలు స్వీకరిస్తున్న కలెక్టర్ నాగరాణి

భీమవరం:మే,14 (తెలుగు న్యూస్ పవర్.కామ్) కృష్ణాజిల్లా, కంకిపాడు మండలం, తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదన రావు బుధవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సి.నాగరాణి చేతులు మీదుగా జిల్లాలోని 31 గ్రంథాలయాలకు 6 విభాగాలకు సంబంధించిన మొత్తం 228 పుస్తకాలను బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, గ్రంధాలయాలకు అందించిన పుస్తకాలలో బాలల గేయాలు, బతుకు పాటలు, ఎదిగే ఆడపిల్ల ఏమీ తెలుసుకోవాలి, పద్య పారిజాతాలు, మహాత్ముని అడుగు జాడలు, గాంధీ మహాత్ముని దృష్టిలో విద్యా, పర్యావరణం – పరిశుభ్రత తదితర పుస్తకాలు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు, పాఠకులు ప్రతిరోజు లైబ్రరీలకు వెళ్లి ఈ పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించవలసిందిగా కోరారు. వేసవి విజ్ఞాన శిబిరాలలో శిక్షణ పొందుతున్న ప్రతి విద్యార్థి ఇటువంటి పుస్తకాలను చదివి విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. దాతలు ఇచ్చిన పుస్తకాలను లైబ్రరీ రికార్డులలో నమోదు చేసుకొని, పుస్తకాల నిర్వహణ సజావుగా చేసుకోవాలని గ్రంథాలయ సిబ్బందికి తెలియజేశారు. ఈ సందర్భంగా, పుస్తకదాత మధుసూదన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.