విజయవాడ: మే,15(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు, పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు నో వెహికల్ డే సందర్భంగా తన క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నివాసానికి దాదాపు 12 కిలోమీటర్లు శుక్రవారం సైకిల్ సవారీ చేశారు. ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొదుపు చర్యల్లో భాగంగా సైకిల్ సవారి చేసినట్టు మంత్రి తెలిపారు. రాబోయే ఆర్థిక విపత్తును దురదృష్టం ఆలోచించి ఇప్పటినుంచి పొదుపు చర్యలు చేపట్టాలని ప్రజలకు సూచించిన అంశాన్ని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎద్దేవా చేయటాన్ని మంత్రి నిరసించారు. ఇప్పటినుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో అడుక్కుతినే పరిస్థితి రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. పొంచి ఉన్న యుద్ధ పరిస్థితులు, విదేశీ మారకద్రవ్యం లభ్యత తగ్గిపోవడం, డీజిల్ పెట్రోల్ తగినంతగా సరఫరా కాకపోవడం, ధరలు పెరగటం వంటి క్లిష్ట సమస్యల వల్ల ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. అందువల్ల దేశానికి రాష్ట్రానికి వ్యక్తిగతంగా ఎంతో ప్రయోజనం ఉందని తెలిపారు. సైకిల్ సవారి వల్ల ప్రజలను కలుసుకోవడానికి, తన ఆరోగ్యానికి ఉపయోగం ఉంటుందన్నారు.
బ్లేజ్ వాడలో మండే ఎండలో సైకిల్పై ప్రయాణించి, పోలవరం నిర్వాసితులకు కారండార్ ప్యాకేజీ లో భాగంగా 307 కోట్ల రూపాయల నిధులు లబ్ధిదారులకు ముఖ్యమంత్రిచే పంపిణీ చేయించారు. వెళతారాలు అందజేశారు.
మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్ యాత్ర.
మంత్రి నిమ్మల సైకిల్ సవారి