విశాఖపట్నం: మే, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్) విశాఖ జీఎస్టీ నిఘావిభాగం భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు 17వందల కోట్ల రూపాయల భారీ నకిలీ ఇన్ వాయిస్ ల కుంభకోణాన్ని విశాఖ జిఎస్టి నిఘా విభాగం అత్యంత చాకచక్యంగా ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఈ కేసు సంబంధించి ప్రధాన కుట్రధదారు ధంట్ల ఆదిరెడ్డి (అలియాస్ అంజిరెడ్డి)ని డి జి జి ఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ మోసంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడినట్లు గుర్తించారు. అక్రమ ఇన్ వాయిస్ లతో లబ్ధి పొందిన వారి కోసం నిఘా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
జిఎస్టి భారీ కుంభకోణం రూ.17 వందల కోట్లు.
పోలీసుల అదుపులో నిందితుడు అంజిరెడ్డి